
యత్నాళ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
రాయచూరు రూరల్: విజయపుర శాసనసభ్యుడు బసన గౌడ పాటిల్ యత్నాళ్‌పై బీజేపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని హిందూపర సంఘటనలు ఉద్యమించాయి. ఈమేరకు నాయకులు శుక్రవారం రాత్రి విజయపుర నగరలోని సిద్దేశ్వర ఆలయం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్వామి వివేకానంద సేన అధ్యక్షుడు రాఘవ మాట్లాడుతు తండ్రీకొడుకుల కుమ్మక్కుతో గౌడను బహిష్కరించారని ఆరోపించారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రుద్రగౌడ, పాటిల్, నాగరాజ్‌గురు గచ్చిన మనె, ప్రతాప్ పాల్గొన్నారు.
లోకాయుక్త వలలో
ఇద్దరు అధికారులు
బళ్లారి రూరల్: లంచం తీసుకుంటూ ఇద్దరు బెస్కాం అధికారులు లోకాయుక్తకు చిక్కారు. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా మల్లాపురానికి చెందిన రైతు సోమశేఖరప్ప పొలంలో విద్యుత్తు మీటర్ ఎడాది క్రితం కాలిపోయింది. కొత్తమీటరు ఏర్పాటుచేయాలని సంతెబెన్నూర్ జెస్కాం అసిస్టెంట్ ఇంజినీరు మోహన్‌కుమార్, సెక్షన్ అధికారిని సంప్రదించాడు. మీటర్ బిగించడానికి రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో రైతు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం శనివారం నగదు చెల్లిస్తుండగా లోకాయుక్త కమిషనర్ ఎం.ఎస్. కౌలా పూర, ఉపకమిషనర్ కళావతి ఆధ్వర్యంలో అధికారులు హెచ్.గురు బసవరాజ,సరళ దాడి చేశారు. జెస్కాం అసిస్టెంట్ ఇంజనీరు మోహన్ కుమార్, సెక్షన్ అధికారిని అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు.
కుట్టుమిషన్ల పంపిణీ
హొసపేటె: దివంగత దేవరాజ అరస్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2022–23 సంవత్సరానికి సంబంధించి 26 మంది లబ్ధిదారులకు శనివారం నగరంలో గాంధీచౌక్ సమీపంలోని రీడింగ్ రూమ్ ఆవరణలో కుట్టు యంత్రాలను ఎమ్మెల్యే గవియప్ప పంపిణీ చేశారు. అదేవిధంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 41 మందికి ఉచిత విద్యుత్ కుట్టు యంత్రాలను పంపిణీ చేశారు. టీబీ డ్యామ్ 19వ క్రస్ట్ గేట్ ఊడిపోవడం వల్ల నష్టపోయిన 80 మంది మత్స్యకారులకు రూ.30వేలు చొప్పున పరిహారం చెల్లించారు. రూ.10వేల విలువైన ఫిషింగ్ కిట్లను పంపిణీ చేశారు.
ఉచిత పథకాలు ప్రమాదకరం
హుబ్లీ: ఉచిత పథకాలు ప్రమాదకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర పాలన, సంస్కరణ పాలన అధ్యక్షుడు ఆర్‌వీ దేశ్‌పాండే అన్నారు. ఉత్తర కన్నడ జిల్లా దాండేలి అంబే వాడిలో నూతనంగా నిర్మించిన సహయ ప్రాంతీయ రవాణా శాఖఅధికారుల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు ఏమి కూడా ఉచితంగా ఇవ్వరాదన్నారు.మహిళలకు శక్తి పథకం కింద ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని కల్పించారని, ఈ పథకాన్ని పురుషులకు కూడా విస్తరించాలన్న డిమాండ్ వినిపించిందన్నారు. అన్నిటిని ఉచితంగా ఇస్తే ప్రభుత్వం రవాణా సంస్థలను ఎలా నడపగలదని ఆయన ప్రశ్నించారు.

యత్నాళ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి

యత్నాళ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి