లాకప్‌డెత్‌పై న్యాయమూర్తి విచారణ | - | Sakshi
Sakshi News home page

లాకప్‌డెత్‌పై న్యాయమూర్తి విచారణ

Apr 3 2025 1:51 AM | Updated on Apr 3 2025 1:51 AM

లాకప్

లాకప్‌డెత్‌పై న్యాయమూర్తి విచారణ

రాయచూరు రూరల్‌: నగరంలోని పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌ కేసులో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్రామప్ప విచారణ చేపట్టారు. బుధవారం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్‌) ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. రిమ్స్‌ మార్చురీని సందర్శించి అధికారులతో, మృతుడు వీరేష్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, శవ పరీక్షకు సంబంధించి వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీరేష్‌ను చితక బాదడంతో మరణించినట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలనకు వచ్చారు. జడ్జి వెంట తాలూకా ఆరోగ్య అధికారి ప్రజ్వల్‌ కుమార్‌, తహసీల్దార్‌ సురేష్‌ వర్మలున్నారు.

ఇద్దరు అధికారుల సస్పెండ్‌

నగరంలోని పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన లాకప్‌డెత్‌ కేసులో బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశామని బళ్లారి రేంజ్‌ ఐజీపీ లోకేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మేకా నాగరాజు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టీడీ మంజునాథ్‌లను సస్పెండ్‌ చేస్తూ వారిద్దరిపై ఎస్టీ క్రిమినల్‌ కేసులను నమోదు చేశామన్నారు. అధికారులు వీరేష్‌ అనే యువకుడిని చితక బాదడంతో మరణించినట్లు ఫిర్యాదు అందడంతో కేసును సీఐడీకి అప్పగించారన్నారు. ప్రజలు సైబర్‌ నేరాల విషయంలో డిజిటల్‌ అరెస్ట్‌లకు భయపడరాదన్నారు. సైబర్‌ నేరాల విషయంలో బళ్లారి రేంజ్‌ పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో సైబర్‌ నేరాల కట్టడి కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాయచూరులో డీఎస్పీ సత్యనారాయణ సైబర్‌ నేరాలను చూసుకుంటున్నారన్నారు. జింకలను వేటాడి ఊరేగించిన వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎస్పీ పుట్టమాదయ్య ఉన్నారు.

ఇద్దరు అధికారులపై వేటు

నగరంలోని పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన లాకప్‌డెత్‌ కేసులో బాధ్యులైన ఇద్దరు అధికారులను బళ్లారి రేంజ్‌ ఐజీపీ లోకేష్‌ కుమార్‌ సూచనల మేరకు సస్పెండ్‌ చేస్తూ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మేకా నాగరాజు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టీడీ మంజునాథ్‌లను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో గబ్బూరు పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ లోకాయుక్త వలలో చిక్కిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టీడీ మంజునాథ్‌ సస్పెండ్‌ కావడం గమనార్హం.

లాకప్‌డెత్‌పై న్యాయమూర్తి విచారణ 1
1/1

లాకప్‌డెత్‌పై న్యాయమూర్తి విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement