
అనాథలకు అండ.. స్పూర్తిధామ
రాయచూరు రూరల్: సంతానం లేకపోయినా ఆ ఉపాధ్యాయ దంపతులు పేద పిల్లలకు అండగా నిలిచారు. జిల్లాలోని మస్కి తాలూకాలో పేద విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజనం, దుస్తులు, విద్య వంటి సౌకర్యాలు కల్పించి సొంత బిడ్డలుగా 30 మందిని చూసుకుంటున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. మస్కి పట్టణానికి చెందిన రామణ్ణ, శ్రుతి దంపతులకు వివాహం జరిగి 15 ఏళ్లు నిండినా పిల్లలు కాలేదు. ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా రామణ్ణ, కంప్యూటర్ ఉపాధ్యాయినిగా శ్రుతి విధులు నిర్వహిస్తున్నారు. తమ చుట్టు పక్కల ఉన్న అనాథ, పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని వారికి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. అభినందన్ స్పూర్తిధామ పేరుతో ఆరంభమైన పాఠశాలలో రోజు విద్యార్థులకు క్రీడలు, విజ్ఞానం, ఉప నిషత్తులు, గురువందనం, స్తోత్రాలు నేర్పుతారు. రామణ్ణ, శ్రుతి దంపతులు చేస్తున్న ఉదార సేవకు ఉడుతా భక్తిగా అందరి సహకారం లభిస్తోంది. దివ్యాంగుడు దేవరాజ్‌కు రాష్ట్ర స్ధాయి కబడ్డీ, క్రికెట్ క్రీడల్లో స్వంత డబ్బులతో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. ప్రత్యేకంగా అభినందన్ విద్యా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పంచమసాలి సముదాయ భవనం, దాసోహ మంటప భవనాలను నిర్మించారు.
ఆదరిస్తున్న ఉపాధ్యాయ దంపతులు
స్వయంగా పాఠశాల నిర్వహిస్తున్న వైనం

అనాథలకు అండ.. స్పూర్తిధామ