
ప్రభుత్వ బాలికల కళాశాలకు రూ.లక్ష విరాళం
సత్తుపల్లిటౌన్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ మట్టా దయానంద్ సూచించారు. సత్తుపల్లి ప్రభుత్వ బాలికల కళాశాలకు ఏటా రూ.లక్ష చొప్పున ఇచ్చే ఆర్థిక సాయంలో భాగంగా మంగళవారం ఆయన రూ.లక్ష అందజేశారు. ఇప్పటివరకు రూ.3 లక్షలు అందజేసిన నేపథ్యాన అభివృద్ధితో పాటు విద్యార్థుల ప్రోత్సాహకానికి వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం యువసేవా సమితి ఆధ్వర్యాన విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, రాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment