
విజేతల స్ఫూర్తితో రాణించాలి
ఖమ్మంమయూరిసెంటర్: వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతూ కష్టపడే వారు రాణించడం సులువవుతుందని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సుమలత తెలిపారు. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ ఆధ్వర్యాన ఖమ్మం కొత్త బస్టాండ్‌లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంవీఐ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో కాలు మోపడమే కాక విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఆర్‌ఎం సరిరామ్ మాట్లాడుతూ ఇంటి నుంచి మార్పు మొదలైతేనే సమాజంలో కూడా సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రీజియన్ పరిధిలో అత్యుత్తమ పనితీరు కనపరచిన మహిళా సూపర్‌వైజర్లు, కండక్టర్లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్) జీ.ఎన్.పవిత్ర, ఖమ్మం డిపో మేనేజర్ దినేష్‌కుమార్, పర్సనల్ ఆఫీసర్ బాలస్వామి, మెడికల్ ఆఫీసర్ సాయిసుష్మ, అసిస్టెంట్ మేనేజర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment