
న్యాయం చేయాలని మృతదేహంతో ఆందోళన
ఏన్కూరు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. ఏన్కూరు మండలం టీఎల్‌పేటకు ఇందిరానగర్ కాలనీకి చెందిన పసుపులేటి కృష్ణ శుక్రవారం రాత్రి కాలనీ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం శనివారం మధ్యాహ్నం మృతదేహం ఏన్కూరు సెంటర్‌కు చేరుకోగా బంధువులు, గ్రామస్తులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎస్‌ఐ షేక్ రఫీ సిబ్బందితో చేరుకుని నచ్చచెప్పినా వినలేదు. గంటకు పైగా ఆందోళన చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈక్రమాన పోలీసులు – ఆందోళనకారులకు తోపులాట జరగగా, చివరకు వారిని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment