తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్‌

Mar 25 2025 12:11 AM | Updated on Mar 25 2025 12:10 AM

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పగిడిపల్లి వెంకటేశ్వర్లుకు డాక్టరేట్‌ లభించింది. కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్‌ పంతంగి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఆయన ‘డాక్టర్‌ సీతారాం సాహిత్యం – ఒక అధ్యయనం’ అంశంపై పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించగా కేయూ నుంచి డాక్టరేట్‌ ప్రకటించారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లును కళాశాల ప్రిన్సిపాల్‌ జకీరుల్లా , అధ్యాపకులు, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు తదితరులు సోమవారం అభినందించారు.

రేపు జాబ్‌ మేళా

ఖమ్మం రాపర్తినగర్‌: కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్‌ బాలికల డిగ్రీ గురుకుల కళాశాల(లక్ష్య ఇంజనీరింగ్‌ కాలేజీ)లో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్‌.మాధవి తెలిపారు. హైదరాబాద్‌, విజయవాడ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉండగా, డిగ్రీ పాసై 18–30 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఈమేరకు విద్యార్హతల సర్టిఫికెట్లు, ఇతర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లతో బుధవారం ఉదయం 10గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.

మొరాయించిన సర్వర్లు..

ఖమ్మంమయూరిసెంటర్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో వస్తున్న తరుణంలో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఈక్రమంలోనే సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సర్వర్లు నిలిచిపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలు ఓపెన్‌ కాలేదు. దీంతో ఫీజు చెల్లించేందుకు కేఎంసీ కార్యాలయానికి వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఫీజు రాయితీ గడువు ఇంకో వారంలో ముగియనుండగా పలువురు ఉదయమే కౌంటర్ల వద్దకు వచ్చారు. అయితే, ఉదయమంతా సర్వర్లు మొరాయించగా.. మధ్యాహ్నం తర్వాత పని చేశారని ఉద్యోగులు తెలిపారు.

వాటర్‌ బాటిళ్లు ఏమయ్యాయి?

కలెక్టరేట్‌లో 150కిపైగా

సీసాలు మాయం

ఖమ్మం సహకారనగర్‌: కలెక్టరేట్‌లో నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులకు తాగునీరు సమకూర్చేందుకు గాను గతంలో విధులు నిర్వర్తించిన కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ సుమారు 200 వాటర్‌ బాటిళ్లు కొనుగోలు చేయించారు. అందరూ మిషన్‌ భగీరథ నీటినే తాగాలనే ఉద్దేశంతో వీటిని సమకూర్చారు. అయితే, అప్పుడొకటి.. ఇప్పుడొకటి అన్నట్లు బాటిళ్లు మాయమవుతుండగా ప్రస్తుతం 50కూడా లేవని సమాచారం. ప్రస్తుత కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ కలెక్టరేట్‌ను ప్లాస్టిక్‌ ఫ్రీగా మార్చాలనే లక్ష్యంతో శాఖల వారీగా ఎన్ని స్టీళ్లు బాటిళ్లు కావాలో నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో గతంలో కొనుగోలు చేసిన బాటిళ్లపై అధికారులు ఆరా తీయగా 200కు గాను 150మేర కనిపించడం లేదని తేల్చినట్లు సమాచారం. దీంతో ఈ బాటిళ్లు ఎవరు తీసుకెళ్లారు, ఎలా మాయమయ్యాయనే అంశంపై కలెక్టరేట్‌లో చర్చ జరుగుతోంది

సింగరేణి విద్యార్థినుల ప్రతిభ

సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 19న ఖమ్మంలోని కవితా మోమెరియల్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ ఫెిస్టివల్‌లో కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఫెస్టివల్‌కు మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి 108 మంది హాజరుకాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందికి ఎంపిక చేసి బహుమతులు అందించారు. సింగరేణి కళాశాల విద్యార్థినులు కె.వెన్నెల, ఎండీ ఆయేషా మూడో, నాలుగో స్థానా ల్లో నిలవగా సోమవారం ఎడ్యుకేషన్‌ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్‌, కరస్పాండెంట్‌ కే.సునీల్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ చింతల శారద తదితరులు అభినందించారు.

తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్‌
1
1/2

తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్‌

తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్‌
2
2/2

తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement