నేలకొండపల్లి: రామోజీ ఫిల్మ్‌సిటీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఆక్రమించిన యాజమాన్యానికిప్రభుత్వం వత్తాసు పలకడాన్ని నిరసిస్తూ గురువారం సీపీఎం ఆధ్వర్యాన మండల కేంద్రంలో ప్రభుత్వదిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కే.వీ.రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాలను పేదలకు ఇచ్చి, యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పేదల పక్షానా మాట్లాడిన రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హామీలు అమలు చేయకుండా పేదలకు పంచిన స్థలాలను పెద్దలకు దారాదత్తం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఏటుకూరి రామారావు, గుడవర్తి నాగేశ్వరరావు, పెద్దిరాజు నర్సయ్య, సామాల మల్లిఖార్జున్‌రావు, మారుతి కొండలు, కట్టెకోల వెంకటేశ్వర్లు, దండా సూర్యనారాయణ, పి.బాబు తదితరులు పాల్గొన్నారు.