మహిళా సంఘాలకు డ్రెస్‌కోడ్‌! | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు డ్రెస్‌కోడ్‌!

Published Wed, Jan 29 2025 12:53 AM | Last Updated on Wed, Jan 29 2025 12:53 AM

మహిళా

మహిళా సంఘాలకు డ్రెస్‌కోడ్‌!

● ఏడాదికి రెండు చీరెల పంపిణీ! ● నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ● జిల్లాలో 92,512 మంది సభ్యులు

ఆసిఫాబాద్‌అర్బన్‌: స్వయం సహాయక సంఘాల సభ్యులకు డ్రెస్‌కోడ్‌ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో సభ్యురాలికి ఏడాదికి రెండు చీరెలు పంపిణీ చేయాలని భావిస్తోంది. గత ప్రభుత్వం బతుకమ్మ పండుగకు మహిళలకు చీరెలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కొన్నిచోట్ల నాసిరకం చీరెలు పంపిణీ చేయగా మహిళలు నిరసనలు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన చీరెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా రెండు, మూడు రంగుల చీరెలు అందించాలని యోచిస్తోంది. చీరెలకు లేత నీలి రంగు, మువ్వన్నెల అంచు డిజైన్లను ఖరారు చేసింది.

నాణ్యమైన చీరెలివ్వాలి

ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల సభ్యులకు డ్రెస్‌కోడ్‌లో భాగంగా నాణ్యమైన చీరెలు ఇవ్వా లి. గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరెల్లా ఉంటే ఎవరూ కట్టుకోరు.

– కీర్తి, గ్రామైక్య సంఘం

అధ్యక్షురాలు, ఆసిఫాబాద్‌

విధి విధానాలు అందలేదు

స్వయం, సహాయక సంఘాల మహిళలకు ఒకే డిజైన్‌ చీరెలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఏడాదికి రెండు చీరెలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మౌఖిక సమాచారం. ఇదివరకే జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు వివరాలు తెలిపాం. దీనిపై ఇంకా విధి విధానాలు అందలేదు.

– దత్తారావ్‌, డీఆర్డీవో

జిల్లాలో మహిళా సంఘాల వివరాలు

మండలం సమాఖ్య ఎస్‌హెచ్‌జీలు సభ్యులు

సంఘాలు

ఆసిఫాబాద్‌ 47 929 10,419

బెజ్జూర్‌ 20 435 4,977

చింతలమానెపల్లి 19 444 5,218

దహెగాం 19 527 5,821

జైనూర్‌ 32 540 6,217

కాగజ్‌నగర్‌ 43 904 10,438

కెరమెరి 34 541 5,830

కౌటాల 21 588 6,758

లింగాపూర్‌ 18 271 3,208

పెంచికల్‌పేట్‌ 13 264 2,847

రెబ్బెన 26 706 7,922

సిర్పూర్‌ 19 301 3,586

సిర్పూర్‌)టి) 24 504 5,922

తిర్యాణి 27 476 5,537

వాంకిడి 36 708 7,812

మొత్తం 398 8,138 92,512

No comments yet. Be the first to comment!
Add a comment
మహిళా సంఘాలకు డ్రెస్‌కోడ్‌!1
1/1

మహిళా సంఘాలకు డ్రెస్‌కోడ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement