కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
● ఎమ్మెల్సీ దండె విఠల్ ● అభివృద్ధి పనులకు భూమిపూజ
కౌటాల: కాంగ్రెస్ హయాంలోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గురుడుపేట, గుడ్లబోరి, తలోడి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి రాష్ట్రం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా గ్రామాల్లో పలువురు కాంగ్రెస్‌లో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వా నించారు. ఆయా కార్యక్రమాలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్, నాయకులు శ్రీవర్ధన్, ఉమామహేశ్, తిరుపతి, రవీందర్‌గౌడ్, డబ్బా బాపు, పాపయ్య, ప్రేమ్‌కుమార్, అంకుల్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి) మండలం మేడిపల్లిలో..
సిర్పూర్(టి): మండలంలోని మేడిపల్లి గ్రామంలో రూ.5లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ దండె విఠల్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు మండలంలోని మేడిపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment