అనుమతిలేని వెంచర్లపై చర్యలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● అధికారులతో సమీక్ష
ఆసిఫాబాద్: జిల్లాలో అనుమతి లేని వెంచర్లు, లేఅవుట్లపై చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశానికి అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అనుమతి లేని వెంచర్లు, లేఅవుట్ల విషయమై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని తెలిపారు. దరఖా స్తులను పరిశీలించి నిబంధనలకు లోబడి అనుమతులు జారీ చేయాలని సూచించారు. లేఅవుట్ల కమిటీ అధికారులు జిల్లా స్థాయిలో నిబంధనల అమలుపై పర్యవేక్షించాలని తెలిపారు. తనిఖీ నిర్వహించి నివేదిక అందించాలని పేర్కొన్నారు. భవన నిర్మాణాలపై అందిన ఫిర్యాదులను రిజిస్టర్‌లో నమోదు చేసి, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాల ని సూచించారు. బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాలు, అపార్ట్‌మెంట్ల యజమానులు నిర్మాణ పను ల ప్రారంభానికి ముందే అనుమతులు తీసుకోవా లని, నిర్మాణ సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకుని సమాధానం ఇవ్వకుండా పనులు చేపట్టే వారిపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీపీవో భిక్షపతిగౌడ్, ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, పట్ట ణ ప్రణాళిక అధికారి యశ్వంత్, ఆర్‌అండ్‌బీ అధికా రి సురేశ్, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment