సమష్టి కృషితో ‘తిర్యాణి’ అభివృద్ధి
తిర్యాణి(ఆసిఫాబాద్): అధికారుల సమష్టి కృషితోనే తిర్యాణి మండల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. నీతి ఆయోగ్ బ్లాక్ కింద మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షా సమావే శం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో అర్హులైన మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందించి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అభివృద్ధి పనులకు రూ.3కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద మరుగుదొడ్లు నిర్మించాల న్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి మోడల్ రూపొందించాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మోడల్ అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో ఏపీడీ రామకృష్ణ, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
సందర్శించి.. సమస్యలు తెలుసుకుని
మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. రాత్రి ఆశ్రమ పాఠశాలలోనే నిద్రించారు. ఆయన వెంట ఎంపీడీవో వేముల మల్లేశ్, ప్రధానోపాధ్యాయుడు శంకర్ తదితరులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
Comments
Please login to add a commentAdd a comment