కుష్ఠు రహిత జిల్లాగా మార్చుదాం
ఆసిఫాబాద్అర్బన్: కుష్ఠు రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కలిసిరావాలని డీఎంహెచ్వో సీతారాం అన్నారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించే స్పర్శ్ లెప్రసీ క్యాంపెయిన్– 2025పై బుధవారం జిల్లాకేంద్రంలో అధికారులు, సిబ్బందికి శిక్షణ అందించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిగ్రస్తుల శరీరం పాలిపోయి రాగి రంగు మచ్చలు ఏర్పడతాయని, స్పర్శ లేకపోవడం, తిమ్మిర్లు తదితర లక్షణాలు ఉంటాయని తెలిపారు. బహుళ ఔషధ చికిత్స ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. అనంతరం కుష్ఠు నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. పక్షోత్సవాల్లో భాగంగా గ్రామ పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గురువారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. సమావేశంలో లెప్రసీ ప్రోగ్రాం అధికారి అజిమొద్దీన్, ప్రోగ్రాం జిల్లా సహాయ అధికారి ఇస్లావత్ శ్యాంలాల్, పీహెచ్సీల వైద్యాధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment