ఉపాధి కల్పనకు చర్యలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమలు, వాణిజ్యరంగాల్లో ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. ఉద్యోగ సమాచారం అందించాలని ఆదేశించారు. అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. కంపెనీలతో చర్చించి జిల్లాలో జాబ్‌మేళాలు నిర్వహించాలన్నారు. అనంతరం పీఎం విశ్వకర్మ పథకం కింద అందిన దరఖాస్తులపై సమీక్షించారు. ఇప్పటివరకు 2,654 మంది దరఖాస్తు చేసుకున్నారని, శిక్షణ పూర్తి చేసిన వారిలో 452 మందికి రుణాలు మంజూరు చేశామని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీఫ్రైడ్, డీట్, పీఎం విశ్వకర్మ పథకం, తదిత ర అంశాలపై సమీక్షించారు. టీ ఫ్రైడ్ పథకం ద్వారా దళితులు, గిరిజనులకు సంబంధించి రెండు పెట్టుబడి రాయితీ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ.6.37 లక్షలు, పావలా వడ్డీ రాయితీ దరఖాస్తు ఆమోదిస్తూ రూ.13 వేలు మంజూరు చేశామని తెలిపారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సెంజ్ ఆఫ్ తెలంగాణ(డీట్) జిల్లా కమిటీ విధివిధానాలపై మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో కూడిన డీట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకంలో 110 దరఖాస్తులను స్టేజ్– 2 నుంచి స్టేజ్– 3కి పంపించేందుకు ఆమోదించామన్నారు. జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ మదిరే అశోక్, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, డీఆర్‌డీవో దత్తారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment