వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌

Published Fri, Jan 31 2025 1:59 AM | Last Updated on Fri, Jan 31 2025 1:59 AM

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కు

హామీలపై పాలకులే మోసగాళ్లు

పామర్రు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగవేసి పాలకులే మోసగాళ్లు అయిన సంఘటన ఏపీలో జరుగుతోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్‌ కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కృష్ణా జిల్లా పామర్రులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ది గ్రేట్‌ మోసగాడు చంద్రబాబు.. ఎట్టకేలకు ముసుగు తీసేసి సూపర్‌ సిక్స్‌ అమలు ఉండదంటూ నిస్సిగ్గుగా స్పష్టం చేశారన్నారు. మాట తప్పిన చంద్రబాబును, మాటపై నిలిచిన జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నారు.

9 నెలల్లో రూ.1.2 లక్షల కోట్లు అప్పులు

ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల కాలంలో దాదాపు రూ.1.20 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చారు. వాటితో ఎక్కడ సంపద సృష్టించారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రతి పనికి ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందు చూపుతో పోర్టులు, హార్బర్లు నిర్మిస్తుంటే వాటిని మీ వాళ్లకు తెగనమ్మాలనుకున్నది వాస్తవం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు.

ప్రస్తుతం దోపిడీ వ్యవస్థకు ప్రోత్సాహం

గతంలో వచ్చిన కృష్ణానది వరదలకు నిరాశ్రయులైన వారికి చేరాల్సిన బాధితుల సాయం రూ.4 కోట్లు స్థానిక టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్ల లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో దళితులపై అన్యాయంగా దాడులు చేయించడం జరుగుతోందన్నారు. లంకపల్లి గ్రామంలో తహసీల్దార్‌ ఎకరానికి రూ.20వేలు ఇస్తేనే రిజిష్ట్రేషన్‌ చేస్తానని హుకుం జారీ చేయడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.. భవిష్యత్తులో పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎంపీపీ అశోక్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీలు శ్రీనివాసరావు, రమాదేవి, ఎంపీటీసీలు శ్రీనివాసరావు, రత్నకుమారి, కె నాగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement