సదరం ధ్రువ పత్రాల పునః పరిశీలనను కూడా నిర్వహిస్తున్నారు. పుట్టుకతోనే అంధులుగా ఉన్నా.. వారికి కూడా మళ్లీ పరీక్షలు తప్పడం లేదు. మధ్యలో కంటి చూపు కోల్పోయి పింఛన్లను పొందుతున్న వారికి కూడా ఈ తిప్పలు తప్పనట్లే. పింఛన్ల వెరిఫికేషన్‌కు రావడానికి అంధులు నానా తిప్పలు పడుతున్నారు. కనీస రవాణా సదుపాయాలను ప్రభుత్వం కల్పించకపోవడంతో బాధితులు కష్టాలు పడుతున్నారు. ఆటోలకు రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు చేసి ఆస్పత్రికి చేరుకుంటున్నారు. 15ఏళ్ల నుంచి పింఛన్లు తీసుకుంటున్నామని పునః పరిశీలన పేరిట ఆస్పత్రులకు తిప్పడంపై అంధులు మదన పడుతున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత ఆస్పత్రులకు వచ్చి పునః పరిశీలన చేయించుకోకపోతే పింఛన్లను తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అష్ట కష్టాలు పడి వస్తున్నామని బాధిత పింఛనర్లు వాపోతున్నారు. వివిధ కేటగిరీల కింద పింఛన్ పొందుతున్న దివ్యాంగులను వెరిఫికేషన్ పేరిట ఆస్పత్రులకు తిప్పకుండా వార్డు, సచివాలయాల్లో లేదా ఇంటికెళ్లి అయినా పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లను ఇచ్చారు. తమకు నాటి సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల హయాంలో ఏనాడూ ఇలాంటి ఇబ్బందులు పెట్టలేదని గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment