![సిద్ధాంతాలను ఆచరించిన మహోన్నతుడు జాతిపిత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30mcpm01-310108_mr-1738268443-0.jpg.webp?itok=EKI6GcCd)
సిద్ధాంతాలను ఆచరించిన మహోన్నతుడు జాతిపిత
చిలకలపూడి(మచిలీపట్నం): నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మాగాంధీ అని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారన్నారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచారని కొనియాడారు. చేత కర్ర పట్టి.. నూలు వడికి మురికివాడలు శుభ్రం చేసి కులమత బేధాలు లేకుండా చేశారన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీజీ జీవితాన్ని విడదీసి చూపలేమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment