కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం
మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న వంచన పాలనను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంట్రామయ్య(నాని) అన్నారు. నగరంలోని రామానాయుడు పేటలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నగర కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ నగర అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పేర్నినాని మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అమలు చేసిన పలు పథకాలను అమలు చేయలేమని సీఎం చంద్రబాబునాయుడు చేతులెత్తేయడం సిగ్గుచేటన్నారు. సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి లక్షల కోట్లను అప్పులు చేసి ఆ నిధులను ఎటు మళ్లిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభు త్వ వైఫల్యాలను కార్యకర్తలు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రక్కన పెట్టి రెడ్‌బుక్ పాలన చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందన్నారు. ఈ వేధింపులకు ఎవరూ భయపడేదిలేదన్నారు. ఈ చర్యలను తమ పార్టీ కార్యకర్తలు దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
విజయవంతం చేద్దాం..
ఫిబ్రవరి 5వ తేదీన మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఫీజుపోరు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కార్యకర్తలు సంసిద్ధులు కావాలన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ కాకపోవటంతో చదువులకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ పోరులో పాల్గొనేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణ మూర్తి(కిట్టు), నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లంకే వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్‌లు, పలువురు కార్పోరేటర్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ నెల 5న ఫీజుపోరును
జయప్రదం చేద్దాం
కార్యకర్తల సమావేశంలో వైఎస్సార్‌సీపీ
కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్నినాని
Comments
Please login to add a commentAdd a comment