కేసుల పరిష్కారమే ధ్యేయంగా పని చేయండి
విజయవాడస్పోర్ట్స్: తటస్థంగా ఉండే మధ్యవర్తుల ద్వారా వివాదాల పరిష్కారం సులభతరం అవుతుందని ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ అరుణ సారిక అన్నారు. విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో ఐదు రోజులపాటు జరిగిన 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం శుక్రవారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం ద్వారా 30 మంది న్యాయ వాదులు, సోషల్ వర్కర్లకు మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇచ్చినట్లు ఆమె వివరించారు. నిపుణులైన బీనా దేవరాజ్, సుధా ద్వారా తెలుసుకున్న మీడియేషన్ కాన్సెప్ట్–టెక్నిక్స్‌ను విజయ వంతంగా అమలు చేయాలని శిక్షణ పొందిన న్యాయవాదులు, సోషల్ వర్కర్లకు సూచించారు. న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, న్యాయమూర్తి ఏ సత్యానందం పాల్గొన్నారు.
ఘనంగా బాల ఏసు ఉత్సవాలు ప్రారంభం
హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానిక గుడివాడరోడ్డులోని జ్యోతినగర్ ఆర్సీఎం చర్చి అద్భుత దివ్య బాల ఏసు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్సీఎం చర్చిను విద్యుత్ దీపాలతో వైభవంగా అలంకరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు మేత్రాసనం ఫాదర్ బాల దైవ సందేశాన్ని అందించారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మరియమ్మ, బాల ఏసు, ఏసుక్రీస్తు ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జ్యోతినగర్ విచారణ గురువు చేబ్రోలు జోసఫ్ తంబి, జేఎంజే సిస్టర్స్ ఆంథోనమ్మ, మంజు, భాగ్య, అనంతమ్మ, అన్నమ్మ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక
Comments
Please login to add a commentAdd a comment