కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహరి
(మంగళ) (బుధ)
విజయవాడ 6.23 4.56
మచిలీపట్నం 6.22 4.53
బాబా సేవలో ధనుంజయ శర్మ
మధురానగర్(విజయవాడసెంట్రల్): ముత్యాలంపాడు సాయిబాబా మందిరాన్ని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చల్లా ధనుంజయ శర్మ సోమవారం దర్శించుకున్నారు. మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన వీసీ రాంజీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా వర్సిటీ వీసీ రాంజీ సోమవారం ఎస్పీ ఆర్.గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీకి మొక్క అందజేసి, వర్సిటీ భద్రతపై చర్చించారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధ దంపతులు యార్లగడ్డ మస్తాన్, సక్కుభాయమ్మ స్వగ్రామం మొవ్వ మండలం తురకపాలెం. ఇద్దరి వయసు ఏడు పదులు దాటింటింది. కన్నబిడ్డలు దూరంగా ఉండటంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. వృద్ధాప్య పింఛన్‌తో బతుకుబండి లాగొచ్చని ఆశపడ్డారు. పింఛను ఇప్పించాలని సచివాలయ సిబ్బందిని, కూటమి నాయకులను వేడుకున్నారు. ‘మీరు మాకు ఓటు వేయలేదు కదా? పింఛను ఎందుకు ఇవ్వాలి’? అని కూటమి నాయకులు కోపగించుకున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధ దంపతులు కలెక్టరేట్‌కు వచ్చారు. పింఛన్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. పిల్లలపై ఆధారపడకుండా పింఛను డబ్బులతో తాము బతుకు వెళ్లదీస్తామని, తమ వేదనను అధికారులు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.
7
న్యూస్‌రీల్
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
Comments
Please login to add a commentAdd a comment