పెండింగ్ పనులపై ఫోకస్
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతా ల్లోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్ర భవనాల మరమ్మతులకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన చాంబర్‌లో ఆర్‌డ బ్ల్యూఎస్, ఐసీడీఎస్, సీపీవో, గనులు, పంచాయతీ తదితర అధికారులతో సీఎస్‌ఆర్, ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు శ్లాబ్‌లు, ఫ్లోరింగ్, కిటికీలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటివి ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేయాలన్నారు. సకాలంలో 148 అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతుల పనులు పూర్తి చేసిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ అభినందించారు. జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డీపీవో జె. అరుణ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి నటరాజ్, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి పాల్గొన్నారు.
త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా కలెక్టర్ బాలాజీ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment