వైద్యసేవ ఫీల్డ్ సిబ్బందికి కేడర్ కల్పించాలి
మచిలీపట్నంఅర్బన్: వైద్య సేవా పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ లెవల్ సిబ్బందికి మినిమమ్ స్కేల్, కేడర్, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు కలిసినా సమస్యలు పరిష్కారం అవ్వలేదని సోమవారం ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది 17 ఏళ్ల సర్వీసుని పరిగణనలోకి తీసుకొని ఫీల్డ్ సిబ్బందిని ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. వైద్య మిత్రాలకు డీపీఓ కేడర్, ఆఫీస్ అసోసియేట్, టీమ్ లీడర్లకు సమాన అర్హత కలిగిన కేడర్, జిల్లా మేనేజర్లకు డీవైఈఓ కేడర్ అమలు చేసి కనీత వేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం మీ కోసంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతి పత్రం సమర్పించారు. స్టేట్ యూనియన్ జనరల్ సెక్రటరీ గురవయ్య, జిల్లా ప్రెసిడెంట్ నాగరాజు, సెక్రటరీ పోతురాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ డెన్నిపాల్, కోశాధికారి అనిత తదితరులు పాల్గొన్నారు.
విధులు బహిష్కరించి నిరసన తెలిపిన ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment