అదనపు పనులు చేయలేం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ నందు గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవి, సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, డీఎంహెచ్‌ల పరిధిలో పనిచేయడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒకే సమయంలో వేర్వేరు శాఖల పనులతో పనిభారం పెరిగిందన్నారు. పనిభారం తగ్గించాలని ఉన్నతాధికారులను కోరుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. అదనపు పనులు చేయించవద్దని వైద్య ఆరోగ్యశాఖ జారీ చేస్తున్న ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. అసోసియేషన్ గౌరవ సలహాదారుడు ఏవీ నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలో గ్రామ, వార్డు సచివాలయాల
హెల్త్ సెక్రటరీలు
Comments
Please login to add a commentAdd a comment