ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో పీ4 జిల్లా స్థాయి పోటీలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పేదరిక నిర్మూలన అనే అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ మేకింగ్ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీలలో పాల్గొని వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు పోటీలు నిర్వహించామన్నారు. పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎన్టీఆర్ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ కొల్లేటి రమేష్, డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ అజయ్ బాబు, డాక్టర్ రాధిక, డాక్టర్ పీఎల్ దాస్, డాక్టర్ భాను ప్రసాద్ వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment