బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం
‘మీ కోసం’లో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో అందిన ప్రతి అర్జీని చట్టపరిధిలో పరిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీ కోసంలో బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎస్పీ, మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్య ఎలాంటిదైనా పరిష్కరించటమే పోలీసుల కర్తవ్యమన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు చర్యలు ఉంటాయన్నారు. అర్జీకి పరిష్కారం లభించని పక్షంలో మరలా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అమర్యాదగా ప్రవర్తించినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి చర్యలకు పాల్పడే సిబ్బందిపై కచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సోమవారం జరిగిన మీ కోసంలో 37 అర్జీలు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment