ప్రకాశించాలని.. ప్రయాస!
ఉడికిన కొమ్ములను కల్లంలో ఆరబెట్టిన దృశ్యం
పచ్చబంగారం(పసుపు) ఈ సారి ప్రకాశిస్తుందన్న ఆశతో రైతన్నలు ఉత్సాహంగా పనులు చేపడుతున్నారు. వాణిజ్య పంటల్లో ఒకటైన పసుపు పంటను కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ వ్యవసాయ సీజన్‌లో 5,031 ఎకరాల్లోనూ, ఎన్టీఆర్ జిల్లాలో 707 ఎకరాల్లోనూ సాగు చేశారు. కొద్ది రోజులుగా పసుపు ఆకుతీత, దుంప తీత పనులను రైతులు ముమ్మరంగా చేపడుతున్నారు. కల్లాల్లో పసుపు కొమ్ములను రాశులుగా పోసి వంట పనులు చేపడుతున్నారు. సహజంగా పసుపు కొమ్ములను బాండీల్లో పెట్టి ఉడికించి ఆరబెడుతుంటారు. ఈ దఫా అధికశాతం మంది బాయిలర్స్‌ను వినియోగిస్తున్నారు. ఆ తర్వాత ఎండబెట్టి పసుపు కొమ్ముల నాణ్యత పెంచే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మంచి ధర వస్తే మార్కెట్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
– కంకిపాడు
ప్రకాశించాలని.. ప్రయాస!
Comments
Please login to add a commentAdd a comment