చెప్పుకోలేక.. కన్నీళ్లు దిగమింగలేక!
కన్నబిడ్డలు ఉన్నారో లేరో తెలియదు.. భారమై వదిలించుకున్నారో, తానే వాళ్లకు భారమనుకున్నాడో చెప్పుకోలేడు.. ముదిమి వయసులో మండుటెండలో జీవశ్చవమయ్యాడు. కాళ్లు కదపలేడు, కన్నీటిని ఆపుకోలేడు.. ఊరు పేరు తప్ప వివరాలకు ఉబికి వచ్చే కన్నీళ్లే సమాధానం. ఈ 70 ఏళ్ల శరీరం కర్నూలు నడిబొడ్డున, ప్రభుత్వాసుపత్రి ఎదుట మంగళవారం మధ్యాహ్నం దిక్కులు చూస్తూ.. దేవుడిపైనే భారం వేసింది. రోడ్డు మధ్యనున్న పచ్చని డివైడర్‌లో ఈ ‘పెద్దరికం’ మోడుబారి పడుకుంది. ఇతని పేరు సత్యనాగరాజు. ఊరు విజయవాడ తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి అతనిది. విషయం తెలుసుకున్న ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు చలించిపోయారు. ‘108’ని పంపి ఆయన్ను క్యాజ్‌వాలిటీలో అడ్మిట్ చేయించారు. –కర్నూలు(హాస్పిటల్)
Comments
Please login to add a commentAdd a comment