
‘సహకార సేనాని’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ పూర్వ అధ్యక్షుడు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు సహకార రంగానికి అందించిన సేవలకు గుర్తుగా రూపొందించిన ‘సహకార సేనాని’ ప్రత్యేక సంచికను ది గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో శనివారం ఆవిష్కరించారు. నాలుగు దశాబ్దాల పాటు సహకారోద్యమాలకు నాయకత్వం వహిస్తూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్(న్యూఢిల్లీ) డైరెక్టర్‌గా, ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ వ్యవస్థాపక కార్యదర్శిగా, అధ్యక్షుడిగా తెలుగునాట అర్బన్ బ్యాంకుల అభ్యున్నతికి పాటుపడిన ఆంజనేయులు సేవలకు గుర్తింపుగా ఆయన సహకార ప్రస్థానంపై ఏపీ ఫెడరేషన్ ఈ ప్రత్యేక సంచికను రూపొందించింది. ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర, సహకారోద్యమ నేత మానం ఆంజనేయులు, ఏపీ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ కార్యదర్శి, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ జిలాని, డైరెక్టర్లు కోళ్ల అచ్యుతరామారావు, ఎం.వెంకటరత్నం, ఏవీ అంబికా ప్రసాద్, వేమూరి వెంకట్రావు, శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులు కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.