
అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో విజయవాడకు చెందిన కళాక్షేత్ర నృత్య కళాబృంద సభ్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై సీహెచ్ తన్మయి పర్యవేక్షణలో 25మంది కళా బృంద సభ్యులు పలు కీర్తనలకు లయబద్ధంగా నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయంత్రం పంచహారతుల సేవ అనంతరం అమ్మవారిని దర్శించుకుని కళావేదిక వద్దకు చేరుకున్న భక్తులు నృత్య ప్రదర్శనను ఆద్యంతం ఎంతో ఆసక్తితో వీక్షించి చిన్నారులను అభినందించారు. అనంతరం ఆలయ అధికారులు, కళాబృందానికి అమ్మవారి దర్శనం కల్పించి ప్రసాదాలను అందజేశారు.