
కర్నూలు: పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రేమకాంతప్ప ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. గత రాత్రి ఇంట్లో గుండెపోటుకు గురయ్యారని.. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.
ప్రేమకాంతప్ప స్వగ్రామం ఆలూరు మండలంలోని మరకట్టు గ్రామం. సోమవారం ఉదయాన్నే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఆయన మృతి పట్ల డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు పార్థసారథి, శ్రీనివాస్‌నాయక్, విక్రమసింహా, నరసింహరాజు, ఎస్‌ఐలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment