21లోగా ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ ఆరో సెమిస్టర్ విద్యార్థులు సెమిస్టర్ లాంగ్ ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్లను ఈనెల 21వ తేదీలోగా పూర్తి చేయాలని వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ సూచించారు. బుధవారం వీసీ చాంబర్‌లో వర్సిటీ పరిధిలోని కర్నూలు, నంద్యాల జిల్లాల కళాశాలల విద్యార్థుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఇంటర్న్‌షిప్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణతో సమీక్షించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నారు. ఉన్నత విద్యామండలి గుర్తించిన సంస్థల్లోనే తప్పనిసరిగా ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ విజయకుమార్ నాయుడు మాట్లాడుతూ వర్సిటీకి అనుబంధంగా ఉమ్మడి జిల్లాలోని 92 డిగ్రీ కళాశాలల్లో బీఏ కోర్సుల కాంబినేషన్‌లో 1422, బీకాం కోర్సుల కాంబినేషన్‌లో 3481, బీఎస్సీ కోర్సుల కాంబినేషన్‌లో 2965, ఇతర కోర్సుల్లో 586 మందితో కలిపి మొత్తం 8454 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు సుమారు 4 నెలల పాటు ఇంటర్న్ షిప్ కొనసాగించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు తమ ఇంటర్న్ షిప్‌ల పురోగతిని నిర్దేశించిన ప్రొఫార్మాలో పూర్తి చేసి వర్సిటీకి సమర్పించాల్సి ఉంటుందని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు అన్నారు. అప్పుడు మాత్రమే ఆ విద్యార్థులకు సెమిస్టర్ చివర్లో వైవా, పరీక్షలు నిర్వహించడానికి వీలవుతుందన్నారు. మరింత సమాచారం కోసం వర్సిటీలోని నోడల్ ఆఫీసర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment