మొదటిరోజు దరఖాస్తులు నిల్
● ఉమ్మడి జిల్లాలో గీత కులాలకు 21 మద్యం దుకాణాలు రిజర్వు
కర్నూలు: ప్రభుత్వం గీత కులాలకు కేటాయించిన 21 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ మొదటిరోజు బోణీ కాలేదు. ఉమ్మడి జిల్లాలో 14 ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి. గీత ఉప కులాల వారీగా లాటరీ ద్వారా రిజర్వు చేస్తూ నంద్యాల జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 10 మద్యం దుకాణాలకు కలెక్టర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆఫ్లైన్, ఆన్లైన్ పద్ధతిలో ఫిబ్రవరి 5వ తేదీ వరకు లైసెన్సుల కోసం వ్యాపారులు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుతో పాటు రూ.2 లక్షల నాన్ రీఫండబుల్ రుసుం చెల్లించాలి. ఫిబ్రవరి 7వ తేదీన కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా ఉంటుంది. మద్యం దుకాణాలకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు లాటరీ తీసి కేటాయిస్తారు. లాటరీలో మద్యం దుకాణం వచ్చిన వారికి రెండేళ్ల కాల పరిమితితో లైసెన్స్ జారీ చేస్తారు.
కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రదక్షిణలు
గీత కులాల వారు సప్లిమెంటరీ కుల ధ్రువీకరణ (సబ్ క్యాస్ట్) పత్రాల కోసం తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ క్యూ కట్టారు. మద్యం దుకాణాల రిజర్వేషన్లు ఉప కులాల వారీగా కేటాయించడంతో ఈడిగ, గౌడ, గౌడ్ పేర్లతో సప్లిమెంటరీ కుల ధ్రువీకరణ పత్రా కోసం ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాల రిజర్వేషన్ల వివరాలు...
మద్యం దుకాణం సామాజిక వర్గం
ప్రతిపాదించిన ప్రాంతం
కర్నూలు కార్పొరేషన్ గౌడ్
కృష్ణగిరి గౌడ్
కౌతాళం గౌడ్
ఆదోని మున్సిపాలిటీ ఈడిగ
ఆదోని రూరల్ ఈడిగ
మద్దికెర ఈడిగ
కోసిగి ఈడిగ
చిప్పగిరి ఈడిగ
ఆస్పరి ఈడిగ
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ గౌడ
Comments
Please login to add a commentAdd a comment