హౌసింగ్‌ జిల్లా అధికారిగా అజయ్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ జిల్లా అధికారిగా అజయ్‌కుమార్‌

Published Wed, Jan 29 2025 1:26 AM | Last Updated on Wed, Jan 29 2025 1:26 AM

హౌసిం

హౌసింగ్‌ జిల్లా అధికారిగా అజయ్‌కుమార్‌

కర్నూలు(అర్బన్‌): గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారిగా టీ అజయ్‌కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హౌసింగ్‌ జిల్లా అధికారిగా విధులు నిర్వహించిన టీ చిరంజీవి ఏపీఐఐసీ జెడ్‌ఎంగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ –4లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అజయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హౌసింగ్‌ కర్నూలు ఈఈ కేఎల్‌ ప్రభాకర్‌, డీఈఈ కృష్ణమూర్తి, మేనేజర్‌ సూర్యకుమార్‌, కార్యాలయ సిబ్బంది అభినందలు తెలిపారు.

విధుల్లో నిర్లక్ష్యంగావ్యవహరిస్తే చర్యలు

సి.బెళగల్‌: గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కర్నూలు జిల్లా గురుకుల పాఠశాలల కో ఆర్డీనేటర్‌ (డీసీఓ) శ్రీదేవి హెచ్చరించారు. సి.బెళగల్లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో సోమవారం చోటు చేసుకున్న విద్యార్థుల కిడ్నాప్‌ డ్రామా నేపథ్యంలో మంగళవారం ఉదయం పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్‌ బలరాముడు, ఎంఈఓ – 2 ఆదామ్‌ బాషతో కలిసి అధ్యాపకులు, ఉపాధ్యాయుల సమావేశమై పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం నెలకొందని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులు పాఠశాలలోకి ఎలా వస్తారని సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైస్‌ ప్రిన్సిపల్‌ విజేయుడు, అధ్యాపకులు చింతలయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాకు

4,54,924 పింఛన్లు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఎన్‌టీఆర్‌ పెన్షన్‌ కాను క కింద ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4,54,924 పింఛన్లకు రూ.194 కోట్లు మంజూరు అయ్యాయి. జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో 1,005 పింఛన్‌లపై కోత పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నెలనెలా గుట్టచప్పుడు కాకుండా పింఛన్‌లలో కోత విధిస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో జనవరిలో పింఛన్‌ల సంఖ్య 2,39,818 ఉండగా... ప్రస్తుతం ఈ సంఖ్య 2,39,332కు తగ్గింది. వీటికి సంబంధించి రూ.102 కోట్లు మంజూరయ్యాయి. నంద్యాల జిల్లాలో జనవరి నెలలో పింఛన్‌ల సంఖ్య 2,16,111కి ఉండగా.. ఫిబ్రవరి నెలలో పింఛన్‌ల సంఖ్య 2,15,592 తగ్గింది. వీటికి సంబందించి రూ.91 కోట్లు మంజూరు అయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు పింఛన్‌లు పంపిణీ చేస్తారు. జనవరి నెలలో పింఛన్‌లు తీసుకోని వారు ఫిబ్రవరి నెలలో రెండు నెలల మొత్తం తీసుకోవచ్చు.

లేగదూడల పెంపకంపై

ప్రత్యేక శ్రద్ధ చూపాలి

నందవరం: పాడిరైతులు లేగ దూడల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కర్నూలు జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసులు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దకొత్తిలి గ్రామంలో లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశు సంవర్ధక శాఖ తరఫున మేలైన పశు జాతి లింగ నిర్ధారిత వీర్యాన్ని వినియోగించుకుని మేలు జాతి దూడలను పొందాలని సూచించారు. రైతులు పశుపోషణలో జాగ్రత్తలు పాటించి రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఈఓ డాక్టర్‌ రాజశేఖర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటరమణ, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డాక్టర్లు మల్దన్న, సుబ్రహ్మణ్యేశ్వర ఆచారి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
హౌసింగ్‌ జిల్లా అధికారిగా  అజయ్‌కుమార్‌ 1
1/2

హౌసింగ్‌ జిల్లా అధికారిగా అజయ్‌కుమార్‌

హౌసింగ్‌ జిల్లా అధికారిగా  అజయ్‌కుమార్‌ 2
2/2

హౌసింగ్‌ జిల్లా అధికారిగా అజయ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement