ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా శ్రీశైలం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సంకల్పించిందని కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి ఎ.విద్యావతి తెలిపారు. ఈ మేరకు బుధవారం శ్రీశైలంలోని దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో విద్యావతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి, నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, పర్యాటకశాఖ అధి కారులు పాల్గొన్నారు. శ్రీశైల యాత్రకు వచ్చిన పర్యాటకులు నాలుగు రోజుల పాటు బస చేసి, ఇక్కడి పర్యాటక ప్రదేశాలను సందర్శించుకునేందు కు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. క్షేత్ర పరిధిలో ప్రస్తుతం ఆటోలు, సైట్ సీయింగ్ జీపుల వారికి ఏమైనా గుర్తింపు కార్డులు ఉన్నాయా, ఎంత చార్జీ లు వసూలు చేస్తున్నారు అనే విషయాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి ఎ.విద్యావతి మాట్లాడుతూ.. శ్రీశైలం, ద్వారకా, ఖజురహో ప్రదేశాలను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. మరో 8 ఎనిమిది నెలల్లో మూడు దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఆయా సమస్యలను పరిష్కరించడానికి కార్యచరణ, ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి విద్యావతి
Comments
Please login to add a commentAdd a comment