ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి.. | - | Sakshi
Sakshi News home page

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి..

Published Thu, Jan 30 2025 1:53 AM | Last Updated on Thu, Jan 30 2025 1:53 AM

ఇంటి

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి..

కోసిగి మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన ఈడిగ గిడ్డయ్య(28)కు భార్య లక్ష్మి, కూతు ళ్లు అనురాధ, అక్షిత, కొడుకు యువరాజు ఉన్నారు. ఆ కుటుంబానికి ఎకరా మెట్ట పొలం ఉంది. తోడబుట్టిన తమ్ముళ్లకు పొలాన్ని కౌలుకు ఇచ్చి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. ఆటో రిపేరి రావడంతో, కుటుంబ పోషణ భారమైంది. అప్పటికే సేద్యానికి, పోషణకు రూ.3 లక్షలకుపైగా అప్పు కావడంతో ఇంటిల్లిపాదిని తీసుకుని సుగ్గికి వెళ్లాడు. తెలంగాణలోని మక్తల్‌ నియోజకవర్గం నాచర్ల గ్రామానికి పత్తి తీయడానికి వెళ్లారు. గతేడాది డిసెంబర్‌ 10వ తేదీన పిల్లల పాలు, బిస్కెట్ల కోసం గిడ్డయ్య బజారుకు వెళ్లి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. ఇంటి పెద్దదిక్కు కాలం కావడంతో లక్ష్మి దిక్కులు చూస్తోంది. పిల్లల పోషణ కోసం ఊరిలోనే రోజూవారి కూలీకి వెళ్తోంది. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక కన్నీళ్లు పెట్టుకుంటోంది.

ప్రమాదాల బారిన వలస కూలీలు

రోడ్డున పడుతున్న కుటుంబాలు

వలసల నివారణలో

అధికారుల వైఫల్యం

మృతుల కుటుంబాలను ఆదుకోని

ప్రభుత్వం

మంత్రాలయం: జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు తుంగభద్ర దిగువ కాలువ నీరు ప్రధాన సాగునీరు. తర్వాత మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో గురురాఘవేంద్రప్రాజెక్టు ఎత్తిపోతల పథకం, గాజులదిన్నె ప్రాజెక్టులే సాగునీటి వనరులు. పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా జలాల ఆధారిత చెరువులపై ఆధారపడి సాగు సాగుతోంది. సాగునీటి వనరులు కొరతతో ఎక్కువగా వర్షాధార పంటలు సాగు చేయాల్సి వస్తోంది. వానకాలం ముగిసిన వెంటనే ఇక్కడ వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళ్లడం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల నుంచి దాదాపు 42 వేల కుటుంబాలకుపైగా వలస వెళ్లినట్లు అంచనా. ఒక్క మంత్రాలయం నుంచే 13 వేల కుటుంబాలు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వలస సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. నగదు బదిలీ పథకాలు కొరవడటం, రైతు పోత్సాహకాలు లేకపోవడంతో సుగ్గిబాటలో తరలిపోతున్నారు. లక్షలాది మంది వలస బాట పట్టినా ప్రభుత్వంలో చలనం లేకపోయింది. వలసలు నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. వలస వెళ్లిన కుటుంబ సభ్యులను కోల్పోయి ఆదుకునేందుకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఒక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం తప్ప ఇక్కడి వలస జీవులకు ఆధారం లేకపోయింది. ఉపాధి వేతనం సైతం అరకొరగా వస్తుండటంతో కూలీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వలస నివారణకు ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పడం, వృత్తి కళలపై ఆసక్తి పెంచడం, ఇతర కుటీర పరిశ్రమలకు సహాయ సహకారాలు అందించడం చేయాలి. అంతేగాక ఆర్డీఎస్‌ కుడిగట్టుకాలువ, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులు నిర్మాణం జరగాలని, గురురాఘవేంద్రప్రాజెక్టు ఎత్తిపోతల పథకాల్లో ఆయకట్టు స్థిరీకరించాలని, కొత్తగా కౌతాళం మండలం మేళిగనూరుతో తుంగభద్ర నది నుంచి సమాంతర కాలువ నిర్మాణం చేపట్టాలని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బిడ్డ

దూరమై..

ఎమ్మిగనూరు మండలం కనకవీడు గ్రామానికి చెందిన వడ్డె వీరశేఖర్‌, రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఆదిలక్ష్మి, మహేశ్వరి, కుమారుడు పరశురాముడు ఉన్నారు. గతేడాది పిల్లలతోపాటు తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌కు వెళ్లారు. సీడ్‌ పత్తి పనులకు వెళ్లారు. శ్రావణమాసం కావడంతో వడ్డె వీరశేఖర్‌, రామలక్ష్మి స్వగ్రామం వచ్చారు. అక్కడే ఆదిలక్ష్మిని పనికి వదిలేసి వచ్చారు. గతేడాది ఆగస్టు 20వ తేదీ సాయంత్రం ఆదిలక్ష్మి (15) పొలం పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురైంది. పిడుగు పడటంతో ప్రాణాలు వదిలింది. పెద్ద కూతురు మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయినా వారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో తెలంగాణలోనే పత్తి పనులకు వలస వెళ్లారు.

ఆదిలక్ష్మి

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి.. 
1
1/2

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి..

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి.. 
2
2/2

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement