కుంభాభిషేకాన్ని విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

కుంభాభిషేకాన్ని విజయవంతం చేద్దాం

Published Thu, Jan 30 2025 1:53 AM | Last Updated on Thu, Jan 30 2025 1:53 AM

కుంభా

కుంభాభిషేకాన్ని విజయవంతం చేద్దాం

కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జరిగే కుంభాభిషేకం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ అన్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు అధ్యక్షతన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ కుంభాభిషేకానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఐదు రాజగోపురాలతో పాటు గర్భగుడిపై వేదపండితులు హెలికాప్టర్‌ ద్వారా పుష్పాలు జల్లుతారని, ఈ మేరకుహెలిక్యాప్టర్‌ ల్యాండింగ్‌కు స్థలాన్ని పరిశీలించామన్నారు. ఆయన వెంట ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, డీఎల్‌పీఓ నూర్జహాన్‌, తహసీల్దారు రజనీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ సుబ్బారాజు, కౌతాళం సీఐ అశోక్‌కుమార్‌ ఉన్నారు.

ముగ్గురు న్యాయమూర్తుల నియామకం

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలులో ఖాళీగా ఉన్న మూడు కోర్టులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇచ్చారు. కర్నూలు మహిళా కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న జి.భూపాల్‌రెడ్డిని ఖాళీగా ఉన్న మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కృష్ణా జిల్లా నందిగామలో పనిచేస్తున్న వి.లక్ష్మీరాజ్యంను నియమించారు. ఖాళీగా ఉన్న ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా గుంటూరులో పనిచేస్తున్న టి.లీలావతిని, పోక్సోకోర్టు న్యాయమూర్తిగా విశాఖ పట్నం జిల్లా గాజువాకలో పనిచేస్తున్న ఈ.రాజేంద్రబాబును నియమించారు. ఇన్‌చార్జి న్యాయవాదులతో నడుస్తున్న ఏసీబీ, సీబీఐ కోర్టులకు ఎవరీని నియమించ లేదు.

త్వరలో పూర్తి స్థాయిలోక్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సేవలు

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో త్వరలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె. వెంకటేశ్వర్లు చెప్పారు. బుధవారం ఆయన స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను తనిఖీ చేశారు. అందులోని లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఆపరేషన్‌ థియేటర్లు, జనరేటర్లు తదితర విభాగాలకు సంబంధించి అభివృద్ధి పనులను పరిశీలించారు. క్యాన్సర్‌ విభాగంలో డే కేర్‌ కీమోథెరపిని ఇన్‌పేషంట్లకు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ సీఎస్‌కే ప్రకాష్‌ ఆయనకు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.వెంకటేశ్వరరావు, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్సిట్యూట్‌ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ హేమనళిని తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కుంభాభిషేకాన్ని  విజయవంతం చేద్దాం1
1/1

కుంభాభిషేకాన్ని విజయవంతం చేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement