అబద్ధాల బాబును ప్రజలు క్షమించరు | - | Sakshi
Sakshi News home page

అబద్ధాల బాబును ప్రజలు క్షమించరు

Published Thu, Jan 30 2025 1:53 AM | Last Updated on Thu, Jan 30 2025 1:53 AM

అబద్ధాల బాబును ప్రజలు క్షమించరు

అబద్ధాల బాబును ప్రజలు క్షమించరు

కర్నూలు (టౌన్‌): ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలతో మోసం చేసిన అపద్ధాల సీఎం చంద్ర బాబును ప్రజలు క్షమించబోరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా హామీలు అమలు చేయలేమని నిసిగ్గుగా ప్రకటించిన చంద్రబాబు ప్రజలకు భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో బుధవారం ఎస్వీ మోహన్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయం వరకు జగనన్న ప్రభుత్వంపై పనికట్టుకొని ‘పచ్చ’ మీడియాతో విషం కక్కిన చంద్రబాబు అధికా రంలోకి వచ్చాక ఎందుకు అభివృద్ధి చేయలేదని, సంపద సృష్టించలేదని, సంక్షేమం అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

సంపద సృిష్టించడం అంటే భారం మోపడమా?

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై రూ. 15 వేల కోట్ల విద్యుత్‌ భారాలు పెంచారని ఎస్వీ అన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ విలువలు సైతం పెంచారన్నారు. సంపద అంటే ప్రజలపై పన్నుల భారాలు మోయడమా అని ప్రశ్నించారు. నిత్యావసర సరుకుల ధరలను కట్టడి చేయలేక పోయారని విమర్శించారు. ఇప్పటికే రూ.73 వేల కోట్ల అప్పులు చేశారని, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. గవర్నర్‌తో ఒక లెక్క, బీజేపీ నేతతో ఒక లెక్క చెప్పించి.. అసెంబ్లీలో మాత్రం జగనన్న అప్పులు రూ.6 లక్షల కోట్లు అని చెప్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పవన్‌ కల్యాణ్‌తో కూడా ఆంధ్రప్రదేశ్‌ శ్రీలంకలా తయారవుతుందని డ్రామాలు ఆడించారని, ఈ విషయం ప్రజలకు అర్థమైందన్నారు.

హామీల అమలు ఏదీ?

ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ. 15 వేలు, అడబిడ్డ నిధి కింద మహిళలకు రూ. 18 వేలు, నిరుద్యోగులకు రూ. 3 వేలు, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతుభరోసా కింద రూ. 20 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించలేదా అని ఎస్వీ ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయలేకపోతున్న అని సాక్షాత్తూ సచివాలయంలోనే సీఎం ప్రకటించడం సిగ్గు చేటన్నారు. దావోస్‌ పర్యటనలో చంద్రబాబు నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వవచ్చేమోనని ఎద్దేవా చేశారు. దావోస్‌ పర్యటనతో లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తానని పదే పదే చెప్పిన చంద్రబాబు.. ఒక్క రూపాయి కాదు కదా.. ఒక్క ఎంఓయూ చేసుకోలేదన్నారు.

ప్రజలతో కలసి ప్రత్యక్ష ఆందోళనలు

హామీల అమలుపై ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళన లు చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌ రెడ్డి తెలిపారు. ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు చేతేలేత్తెయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. జగనన్న ఐదేళ్ల కాలంలో రూ. 2.75 లక్షల కోట్లు ప్రతి వాడి సంక్షేమానికి ఖర్చు చేశాడని గుర్తు చేశారు. 2014–19 సంవత్సరంలో కేంద్రంతో సఖ్యత ఉన్న చంద్రబాబు అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకులు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

ఎనిమిది నెలలు అయినా

హామీల అమలు ఏదీ?

సంపద అంటే ప్రజలపై

పన్నుల భారాలు మోపడమా?

వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా

అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement