చిన్నారుల ఆధార్ నమోదు వేగవంతం చేయాలి
● జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి
కర్నూలు(అర్బన్): జిల్లాలో 0–6 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ జీ నాసరరెడ్డి కోరారు. బుధవారం సాయంత్రం ఆయన జిల్లా పరిషత్‌లోని తన చాంబర్ నుంచి జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ సాధికారత అధికారిణి, ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్లు, కర్నూలు, ఆదోని డీఎల్డీఓ, ఎంపీడీఓలతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల కంటే అర్బన్ ప్రాంతాల్లో తక్కువ శాతం ఆధార్ నమోదు జరుగుతోందని, పట్టణ ప్రాంతాల్లో కూడా చిన్నారుల ఆధార్ నమోదుపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్లు ఈ అంశంపై ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ముఖ్యంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన మండలాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment