తమ్ముళ్లకు మరింత ఉపాధి | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు మరింత ఉపాధి

Published Wed, Jan 29 2025 1:26 AM | Last Updated on Wed, Jan 29 2025 1:26 AM

-

కర్నూలు(అగ్రికల్చర్‌): తెలుగు తమ్ముళ్లకు మరింత ‘ఉపాధి’ కల్పించేందుకు రంగం సిద్ధమైంది. జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజి నిర్మాణాలకు మరో రూ.30 కోట్లు విడుదలకు రంగం సిద్ధమైంది. 2024 అక్టోబరులో సీసీ రోడ్లు, డ్రెయిన్ల కోసం ఉపాధి నిధులు రూ.60 కోట్ల వరకు మంజూరు చేశారు. అదే నెలలోనే పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ పనులను థర్డ్‌ పార్టీ పేరు తో అధికారపార్టీ నేతలకే అప్పగించారు. ఇప్పటికే చాలా వరకు ఈ పనులు పూర్తి అయ్యాయి. అయితే, కూటమి ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లకు మరింత ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీసీ రోడ్లు, డ్రెయిన్ల కోసం ఎన్‌ఆర్‌సీజీఎస్‌ మెటీరియల్‌ కాంపోనెంటు నుంచి అదనపు నిధులు మంజూరు చేస్తుండటం గమనార్హం. ఒక్కో మండలానికి రూ.కోటి ప్రకారం ఉపాధి నిధుల మంజూరుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది. కొన్ని మండలాలకు రూ.1.50 కోట్ల వరకు ప్రతిపాదించడం గమనార్హం. జిల్లా కలెక్టర్‌ ఒకటి, రెండు రోజుల్లో నిధులు మంజూరుకు పరిపాలన అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీసీ రోడ్లకు నిధుల మంజూరులో చూపుతున్న ఉత్సాహం రైతులకు సంబంధించిన పశువుల షెడ్ల విషయంలో కనిపించడం లేదు. దీంతో జిల్లాలో పశువుల షెడ్ల మంజూరు దరఖా స్తులు దాదాపు 300 వరకు పెండింగ్‌లో ఉన్నాయి.

చెత్త సంపద కేంద్రాలపై

దృష్టి సారించండి

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఆదేశించారు. మంగళవారం ఆయన అమరావతి నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చెత్త సంపద కేంద్రాలను ఫిబ్రవరి 15వ తేదీలోగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలు ఉండగా, 410 చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలు పూర్తి కాగా ప్రస్తుతం 326 షెడ్లు వినియోగంలో ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని అందించేందుకు రెగ్యులర్‌గా ట్యాంకులను శుభ్రం చేయించాలని ఆదేశించారు.

సీసీ రోడ్లు, డ్రెయిన్‌ కోసం

మరో రూ.30 కోట్లు

కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపిన జిల్లా నీటియాజమాన్య సంస్థ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement