జిల్లా అభివృద్ధికి ఒక్క ప్రకటనా లేదు | - | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి ఒక్క ప్రకటనా లేదు

Published Sat, Mar 1 2025 8:14 AM | Last Updated on Sat, Mar 1 2025 8:14 AM

-

● కర్నూలు, నంద్యాల జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం పైసా కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదు.

● ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌హబ్‌కు పరిశ్రమలు వస్తున్నాయని ఇటీవల భరత్‌ ప్రకటించారు.

● అయితే ఒక్క పరిశ్రమపై కూడా బడ్జెట్‌లో ప్రస్తావన చేయలేదు.

● రూ.150కోట్లతో కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ శాశ్వత భవనాలు, కర్నూలు నగరానికి ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, డోన్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌మైన్స్‌, శ్రీశైలంలో టైగర్‌పార్క్‌, ఆలూరులో జింకలపార్క్‌, ఆదోని, ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్‌ టైక్స్‌టైల్‌ అప్పెరల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు.

● కర్నూలులో మైనార్టీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు, కర్నూలులోని సర్వజన వైద్యశాలను ‘రాయలసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌’ స్థాయిగా అభివృద్ధి చేస్తామన్నారు.

● నంద్యాలను ‘సీడ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా అభివృద్ధిచేసి, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థను డీమ్డ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

● బడ్జెట్‌లో వీటికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. నిధులు కేటాయించని పరిస్థితి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement