ఎస్‌ఐ శిక్షణలో ప్రతిభ
కర్నూలు: కర్నూలు పట్టణం ప్రకాష్‌నగర్‌కు చెందిన చైతన్య స్వరూపరాణి ఎస్‌ఐ శిక్షణలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే చైతన్య స్వరూపరాణి ఫైరింగ్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ట్రోఫీ అందుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి దంపతుల కూతురు చైతన్య డిగ్రీలో బయో టెక్నాలజీ పూర్తి చేశారు. పత్తికొండకు చెందిన వెంకటేశ్వర్లు ఉద్యోగ రీత్యా కర్నూలులో ఉంటున్నారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని పోలీస్ శాఖలో ఎస్‌ఐ పోస్టును సాధించినట్లు చైతన్య తెలిపారు. 12 నెలల శిక్షణ కాలంలో ప్రతిభను చూపినందుకు గోల్డ్ మెడల్ దక్కిందని, మే నెల నుంచి నెల రోజుల పాటు ఏపీఎస్‌పీ కర్నూలు బెటాలియన్‌లో శిక్షణ పొందనున్నట్లు చైతన్య తెలిపారు. తనను అనంతపురం జిల్లాకు కేటాయించినట్లు ఆమె తెలిపారు.
హ్యాండ్‌బాల్ విజేత కల్లూరు జట్టు
కర్నూలు (టౌన్): స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ ఇన్విటేషన్ పోటీల్లో కల్లూరుకు చెందిన బడే సాహెబ్ జట్టు విజేతగా నిలింది. ఈ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొన్నాయి. బహుమతుల కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొని మాట్లాడారు. ఇన్విటేషన్ పోటీల్లో పాల్గొనడం ద్వారా క్రీడాకారుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. జిల్లాలోనే కర్నూలుకు హ్యాండ్‌బాల్ క్రీడలో మంచి పేరు ఉందని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు ప్రతిభ చాటారన్నారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి సువర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐ శిక్షణలో ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment