కేఎంసీలో చదవడం గర్వకారణం
● అడిషనల్ డీఎంఈ డాక్టర్ రఘునందన్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించడం గర్వకారణమని అకడమిక్ డీఎంఈ డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. కర్నూలు మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ 2019 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే అమృత్వ–25 పేరుతో మంగళవారం సాయంత్రం కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జి.రఘునందన్ మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించారన్నారు. ఇప్పటి విద్యార్థులు కూడా అదే స్ఫూర్తితో విద్యను అభ్యసించాలని సూచించారు. పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వెంకటరంగారెడ్డి మాట్లాడుతూ ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులు స్పెషాలిటీ కోర్సులపై దృష్టి సారించాలన్నారు. 20 ఏళ్ల క్రితం కర్నూలులో ఇద్దరు మాత్రమే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉండేవారని, ఇప్పుడు వారి సంఖ్య 16కు పెరగడం గమనించాలన్నారు. నేటి విద్యార్థులు పదేళ్లు ముందుగా ఆలోచించి చదివితేనే విజయం సాధిస్తారన్నారు. కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యంలో విలువలు పాటిస్తూ రోగుల పట్ల సానుభూతి చూపాలన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో హాస్టల్ డిప్యూటీ వార్డెన్ డాక్టర్ శ్రీరాములు, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ రేణుకా దేవి, డాక్టర్ హరిచరణ్, డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ విజయానంద బాబు తదితరులు పాల్గొన్నారు.
సబ్జెక్టు వారీగా గోల్డ్ మెడల్స్ అందుకున్న విద్యార్థులు
1. టి.హర్షిత(ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ)
2. ధనిరెడ్డి లక్ష్మినరహరి రెడ్డి(ఫిజియాలజీ, ఫోరెన్సిక్ అండ్ టాక్సికాలజీ, జనరల్ సర్జరీ)
3. నవలూరి శ్రీనాగ ఈశ్వర్(ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ, జనరల్ మెడిసిన్, ఆబ్‌స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్)
4. జి.జి.మానస(బయోకెమిస్ట్రీ, పాథాలజీ)
5. టి.పవన్ సాయి(ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ)
6. మద్దిపట్ల మనోజ్ నాయుడు
(కమ్యూనిటీ మెడిసిన్)
7. కంచి జయశ్రీ వైష్ణవి వర్మ(ఆప్తమాలజీ)
Comments
Please login to add a commentAdd a comment