క్లస్టర్ యూనివర్సిటీ వీసీకి వీడ్కోలు సన్మానం
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ వీసీగా పని చేస్తు న్న ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ పదవీ కాలం ముగియడంతో మంగళవారం వర్సిటీ అనుబంధ కాలేజీ సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు, రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్‌కుమార్, మాజీ రిజిస్ట్రార్ శ్రీనివాసులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ మాట్లాడుతూ క్లస్టర్ యూనివర్సిటీకి మొదటి వీసీగా పని చేయడం సంతోషంగా ఉందన్నారు. వీసీ ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్, వాసంతి దంపతుల ను ఘనంగా సన్మానించారు. వీసీ నేను నా ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్సి టీ అనుబంధ కాలేజీల ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఎం ఇందిరాశాంతి. డాక్టర్ వీవీఎస్ కుమార్, చంద్రశేఖర్ కల్కూర, రచయిత రమణయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment