రాజకీయ కక్షతో వేధిస్తే ప్రజలే తిరగబడతారు
కర్నూలు (అర్బన్): రాజకీయ కక్షతో వేధిస్తే ప్రజలే తిరగబడతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, సీనియర్ న్యాయవాది మద్దూరు సుభాష్ చంద్రబోస్, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఎం.సుబ్బయ్య కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం బడుగు, బలహీనవర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక యునైటెడ్ క్లబ్‌లో ‘ఒకే అంశం – వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు సమంజసమా’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక కన్వీనర్లు, న్యాయవాదులు శేఖర్, శివ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుభాష్ చంద్రబోస్, సుబ్బయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్షపూరిత తప్పుడు కేసులపై హైకోర్టు, సుప్రీం కోర్టు కలుగజేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నా రు. ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారం ఒక కేసు నమోదు చేసి భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలోని చట్టాల ప్రకారం నడుచుకోవాలని డిమాండ్ చేశారు. అలా గాకుండా అధికారం ఉంది కదా అని రాజకీయ కక్షతో ఒకే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 15, 20 కేసులు పెట్టి బాధిత కుటుంబాలను వేధిస్తూ పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తప్పుడు కేసులపై జిల్లా వ్యాప్తంగా మేధావుల సదస్సులు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో న్యాయవాదులు రాజేష్, బంగి సుధీర్, ఉపేంద్రనాథ్, బోయ వెంకటేశ్వర్లు, బాలాజీ రెడ్డి, అబ్దుల్లా సాహెబ్, వెంకట కిషోర్, కిరీటి, విద్యావేత్తలు బోయ అర్జున్, శ్రీరాం పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ అక్రమ కేసులపై
న్యాయస్థానాలు కలుగజేసుకోవాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త
కార్యదర్శి మద్దూరు సుభాష్
చంద్రబోస్, బార్ అసోసియేషన్ మాజీ
అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది
ఎం.సుబ్బయ్య
Comments
Please login to add a commentAdd a comment