
మహిళలను ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు
కర్నూలు(సెంట్రల్): మహిళలను ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. శనివారం నగరంలోని ఎమ్మార్సీ కన్వెన్షన్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎంపీ బి.నాగరాజు, ఎమ్మెల్యే విరుపాక్షి సన్మాంచి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజం, కుటుంబ వ్యవస్థల్లో మహిళ పాత్ర ఎంతో విశిష్టమన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా సెర్ప్ నుంచి రూ.100 కోట్లు, మెప్మా నుంచి రూ.34 కోట్లు, ఎంఎస్‌ఎంఈ ప్రోగ్రామ్ కింద రూ.55 కోట్ల రుణాలను ఇచ్చామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం ఓఎన్‌డీసీ(ఓపెన్ నెట్‌వర్కుఫర్ డిజిటల్ కామర్స్) ప్లాట్ ఫామ్‌తో ఒప్పందం చేసుకున్నామని, ఇందులో ప్రతి మహిళ తాను ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల వివరాలను నమోదు చేస్తే మార్కెటింగ్ లభిస్తుందన్నారు. మార్చి 8న ఒక్కటే దాదాపు 6వేల మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. అనంతరం సెర్ప్, మెప్మా, ఎంఎస్‌ఎంఈల రుణాలతో పాటు ర్యాపిడో ప్రోగ్రామ్ కింద 25 మంది మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలను ప్రదానం చేశారు.
● కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల చేయూతకు విరివిగా రుణాలు ఇచ్చి స్వయం ఉపాధిలో రాణించేందుకు కృషి చేస్తోందన్నారు.
● ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని, కుటుంబ బాధ్యతల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. పొదుపు రుణాలను పొందిన మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నారు.
● జేసీ డాక్టర్ బి.నవ్య మాట్లాడుతూ 1917లో రష్యన్ రెవల్యూషన్స్ సందర్భంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో 1922 మార్చి 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారన్నారు. ఆరోజు నుంచి ప్రతి ఏడాది మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు గర్తు చేశారు.
● డిప్యూటీ మేయర్ రేణుకా సిద్ధారెడ్డి మాట్లాడుతూ చిన్న తనం నుంచే పిల్లల్లో ఆడ, మగ అన్న తేడా లేకుండా పెంచాలని సూచించారు. మహిళలు, బాలికలను గౌరవిండచం నేర్పించినప్పుడే ఉత్తమ సమాజం సాధ్యమన్నారు.
పలువురికి సన్మానం
కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. మెప్మా ద్వారా నలుగురు ప్రేరణ సఖీలకు రూ.50 వేలు ప్పున బహుమతి ఇచ్చి సన్మానించారు. ఆర్పీల్లో మొదటి బహుమతిగా కర్నూలుకు చెందిన ఎస్.పద్మకు రూ.2500, ఎమ్మిగనూరుకు చెందిన బషీర్బాకు రెండో బహుమతిగా రూ.1500, కర్నూలుకు చెందిన జి.శోభారాణికి మూడో బహుమతిగా రూ.1000 కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు అందజేశారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం చైర్మన్ బొజ్జమ్మ, వాల్మీకి కార్పొరేషన్ డైరక్టర్ సంజమ్మ, ఎస్సీ కార్పొరేషన్ డైరక్టర్ శ్రీనివాసులు, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఐసీడీఎస్ పీడీ నిర్మల, మెప్మా పీడీ నాగశివలీల, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అరుణ, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment