శాసీ్త్రయ పద్ధతులతో పాడిపరిశ్రమ లాభసాటి
కర్నూలు(అగ్రికల్చర్): శాసీ్త్రయ పద్ధతులను అవలంబిస్తే పాడిపరిశ్రమను లాభసాటిగా మార్చుకోవచ్చని ఆర్‌ఏహెచ్‌టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధాకర్‌రెడ్డి తెలిపారు. కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలోని ట్రైనింగ్ సెంటర్‌లో పాడిరైతులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా వాణిజ్య సరళిలో పాడిపశువుల పెంపకం అనే అంశంపై సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాడి రైతులనుద్దేశించి ఏడీ డాక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా పాడిపశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అరుణశ్రీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంతంత మాత్రమే
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము ధర ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ రైతులకు అంతంతమాత్రం ధర లభిస్తోంది. సోమవారం మార్కెట్‌కు 254 మంది రైతులు 802 క్వింటాళ్ల వాము తెచ్చారు. గరిష్ట ధర రూ.28,888 ఉన్నట్లు ప్రకటించినప్పటికి.. దాదాపు 240 మంది రైతులకు అంతంతమాత్రం ధరే లభించింది. సగటు ధర రూ.12,399 పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.
● ఉల్లి ధరలు పడిపోయాయి. మార్కెట్‌కు ఉల్లి 2,873 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.517, గరిష్ట ధర రూ.1537 లభించగా... సగటు ధర రూ.1,187 నమోదైంది. మిర్చికి గరిష్టంగా రూ.12769 లభించింది. సగటు ధర కేవలం రూ.8,720 మాత్రమే నమోదైంది. మార్కెట్‌కు 1,768 క్వింటాళ్ల కందులు వచ్చాయి. కనిష్ట ధర రూ.3,100, గరిష్ట ధర రూ.7,158 లభించగా.. సగటు ధర రూ.6,909 మాత్రమే పలికింది.
ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం
● బస్సును ఢీకొన్న ట్రాక్టర్
వెల్దుర్తి: ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ యశ్వంత్ (23) మృతిచెందారు. ఈ దుర్ఘటన వెల్దుర్తి సమీపంలోని హైవే 44పై సోమవారం చోటుచేసుకుంది. ఉదయం 6గంటల సమయంలో కర్నూలు నుంచి అనంతపురం వైపు ఏపీఎస్ ఆర్టీసీ కర్నూలు డిపో అల్ట్రా డీలక్స్ బస్సు వెళ్తోంది. అదే సమయంలో పసుపుల నుంచి వెల్దుర్తికి సొప్పలోడు కోసమని ట్రాక్టరు వస్తోంది. బస్సును పక్కనుంచి ఢీకొనడంతో ట్రాక్టరు ట్రాలీతో విడిపోయి రహదారిపై బోల్తాపడింది. బస్సు డివైడర్ పైకెక్కి, ముందు టైర్లు పగిలిపోయి ఆగిపోయింది. బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పసుపులకు చెందిన ట్రాక్టరు డ్రైవర్ యశ్వంత్ మృతిచెందారు. ట్రాక్టర్ క్లీనర్ అదే గ్రామానికి చెందిన సంజీవ్ గాయపడ్డాడు. బస్సు డ్రైవర్, 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
శాసీ్త్రయ పద్ధతులతో పాడిపరిశ్రమ లాభసాటి
శాసీ్త్రయ పద్ధతులతో పాడిపరిశ్రమ లాభసాటి
Comments
Please login to add a commentAdd a comment