ఈ ప్రభుత్వం వద్దు
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాపై సవతి తల్లి ప్రేమను చూపుతోందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.జగన్నాథం విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో కర్నూలు జిల్లా పేరు లేకుండానే కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం దుర్ణీతికి నిదర్శనమని ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ‘ఈ ప్రభుత్వం మాకు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులైనా వేదవతి, గుండ్రేవుల, ఆర్‌డీఎస్ కుడికాలువ నిర్మాణాలకు నిధులు కేటాయించలేదన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వలస వెళ్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలన్నారు. నాయకులు ఎస్.మునెప్ప, పి.రామకృష్ణారెడ్డి, నాగరాజు, శ్రీనివాసులు, ఈశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment