సాంకేతికతతో నేరాలను నియంత్రిద్దాం
కర్నూలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వర్చువల్ విధానంలో పాల్గొన్న సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌తో ఎస్పీ మాట్లాడారు. సీసీ టీఎన్‌ఎస్ గురించి ఐజీ ఎస్పీతో చర్చించారు. అనంతరం కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లోని కేసుల గురించి ఎస్పీ ఆరా తీశారు. స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు కారణాలను తెలుసుకొని పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు చేశారు.
సీసీటీఎన్‌ఎస్ అప్లికేషన్‌లో
నమోదు తప్పనిసరి
కేసు నమోదు నుంచి అభియోగ పత్రాల దాఖలు వరకు ప్రతి అంశాన్ని సీసీటీఎన్‌ఎస్ అప్లికేషన్‌లో నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీ టీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. హత్య కేసుల్లో, 174 సీఆర్‌పీసీ కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత త్వరగా కోర్టులో దాఖలు చేయాలన్నారు. స్టేషన్‌లో పనిచేసే సీసీ టీఎన్‌ఎస్ పోలీస్ సిబ్బందితో ఈ అంశాలపై మాట్లాడారు.
నేర సమీక్ష సమావేశంలో
అధికారులకు ఎస్పీ ఆదేశం
సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్టేషన్ల వారీగా సదస్సులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాద నియంత్రణ చర్యలతో పాటు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై స్టేషన్ల వారీగా ముమ్మర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జి.హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, భాస్కర్‌రావు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
సాంకేతికతతో నేరాలను నియంత్రిద్దాం
Comments
Please login to add a commentAdd a comment