కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు వారు. రంజాన్ నెల సందర్భంగా సామరస్యాన్ని చాటారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయగా.. హిందూ, ముస్లింలు పోలీసులు అందరూ కలసి వచ్చారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా హాజరయ్యారు. మండ్లెం పీఠాధిపతి కరీముల్లా ప్రార్థన చేయించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందు మతసామరస్యాన్ని చాటిందని ఎస్పీ తెలిపారు. ప్రజలు అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో కలసి మెలసి ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు, ఎస్‌ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో ఎస్పీ విక్రాంత్ పాటిల్