
ఉపాధ్యాయ సమస్యలపై రేపు నిరసన
కర్నూలు కల్చరల్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి బుధవారం కల్టెరేట్ వద్ద నిరసన చేపడుతున్నట్లు ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ కె. ప్రకాష్‌రావు, రాష్ట్ర ఎగ్జిక్యుటివ్ కమిటీ సభ్యులు జి.హృదయ రాజు తెలిపారు. ఎస్టీయూ భవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా కాలం నుంచి కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు మృతిచెందారని, కారుణ్య నియామకాల్లో భాగంగా వారికి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సరెండర్ లీవ్ బకాయిలు 2022 నుంచి పెండింగ్‌లో ఉన్నాయని వాటిని చెల్లించాలని కోరారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ సేవలాల్ నాయక్, ఆర్థిక కార్యదర్శి రంగన్న, నాయకులు రవికుమార్, నవీన్‌పాటిల్, గోకారి, జనార్దన్, శ్రీనివాసరెడ్డి, వెంకటరాముడు, నందీశ్వరుడు పాల్గొన్నారు.